ఆనంద్ దేవరకొండ “హైవే” నుంచి న్యూఇయర్ స్పెషల్ పోస్టర్.!

ఆనంద్ దేవరకొండ “హైవే” నుంచి న్యూఇయర్ స్పెషల్ పోస్టర్.!

Published on Jan 1, 2022 12:00 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత‌ వెంకట్‌ తలారి.

మరి ఈరోజు కొత్త సంవత్సరం కానుకగా “హైవే” చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ తో పాటుగా అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సాంకేతిక నిపుణులుగా కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌, సంగీతం: సైమన్‌ కె. కింగ్‌ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు