ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌ ‘హైవే’ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌..!

ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌ ‘హైవే’ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌..!

Published on Dec 2, 2021 8:15 PM IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ ఇటీవల ‘పుష్ప‌క విమానం’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆనంద్‌ దేవరకొండ హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ ‘హైవే’. ఈ సినిమాలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌ పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నుండగా, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ “118” వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా ‘హైవే’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట‌ర్స్ అభిషేక్ బెన‌ర్జి, స‌యామీఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయని అన్నారు.

చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే ‘హైవే’ అని, పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు