ఆనంద్ దేవరకొండ, పవన్ వైరల్ బ్యూటీ సినిమా షూట్ స్టార్ట్.!

Published on Jul 14, 2021 2:01 pm IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం అయ్యి మంచి నటనతో సెటిల్డ్ అయ్యాడు. మరి ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ ను చేస్తున్న ఆనంద్ నుంచి మరో ఆసక్తికర సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకునిగా మారిన ప్రముఖ దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఇంట్రెస్టింగ్ రోడ్ క్రైమ్ డ్రామా “హైవే” సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినట్టుగా తెలిసింది.

మరి ఈ చిత్రంలో పవన్ హరీష్ సినిమాకి స్టార్టింగ్ లో వినిపించి ఒక్కసారిగా వైరల్ అయ్యిన మళయాళ బ్యూటీ మనసా రాధాకృష్ణన్ ని లాక్ చెయ్యడం విశేషం. మరి ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేసుకున్నట్టుగా కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ సహా దర్శకత్వం అందిస్తున్న గుహన్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి సైమన్ కింగ్ సంగీతం అందిస్తుండగా వెకంటేష్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మి బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :