షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘బేబీ’ మూవీ

Published on Jun 3, 2023 2:01 am IST

యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బేబీ. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి సినీ ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో పాటు ఓ రెండు ప్రేమ మేఘాలిలా మరియు దేవ రాజా పాటలు సాలిడ్ చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. అలానే ఇటీవల విడుదలైన ప్రేమిస్తున్నా అనే పల్లవితో సాగే మూడో సింగిల్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బాబీ మూవీ ఈరోజుతో ప్రొడక్షన్ పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక బేబీ మూవీ జూలై 14న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్‌ నిర్మిస్తున్న బేబీ సినిమాకి సాయి రాజేష్‌ దర్శకుడు. విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :