ఆనంద్ దేవరకొండ న్యూ ఏజ్ లవ్ స్టోరీ “బేబీ” చిత్రం ప్రారంభం

ఆనంద్ దేవరకొండ న్యూ ఏజ్ లవ్ స్టోరీ “బేబీ” చిత్రం ప్రారంభం

Published on Oct 14, 2021 8:00 PM IST


న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న బేబీ చిత్రం నేడు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని ఆశీర్వదిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్ డైరెక్ట్ చేసారు.

ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామి గా ఉండి, విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్.కె.ఎన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్.కే.ఎన్ మరియు మారుతి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెప్పారు.

విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, పుష్ప లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు