షూట్ పూర్తి చేసుకున్న ఆనంద దేవరకొండ ‘హైవే’..!

Published on Oct 9, 2021 2:48 am IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ “హైవే’. ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ప్రముఖ దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ముగించినట్టు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీ మరియు కర్ణాటకలో హైవే చిత్రీకరించబడింది.

అయితే మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, గతంలో ఆది సాయికుమార్ ‘చుట్టాలబ్బాయి’ని బ్యాంక్రోల్ చేసిన వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు రానున్న రోజుల్లో వెలువడనున్నాయి.

సంబంధిత సమాచారం :