ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” చిత్రం పై లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

Published on Oct 10, 2021 10:02 pm IST

ఆనంద్ దేవరకొండ మరియు అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ లు ఇద్దరూ తమ కుటుంబం తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ తిరుపతి ప్రయాణం వెనుక అంటూ ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అందులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఫన్ టైం ఉన్న విడియో ను షేర్ చేసుకున్నారు. విజయ్ అక్కడ కూడా తన పనిలో నిమగ్నమై ఉన్నారు.

అయితే ఆనంద్ దేవరకొండ హీరో గా నటిస్తున్న పుష్పక విమానం చిత్రం నవంబర్ 12 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. కాగా, ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలో మొదలు పెట్టనున్నట్లు ఆనంద్ దేవరకొండ తెలిపారు. అంతేకాక ఈ చిత్రం థియేట్రికల్ విడుదల తర్వాత ఆహా వీడియో లో డిజిటల్ ప్రీమియర్ గా విడుదల కానుంది. ఆహా వీడియో సైతం ఒక పోస్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.

సంబంధిత సమాచారం :