మహేష్ “సర్కారు వారి పాట” సినిమా పై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 29, 2022 6:02 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల నుండి సూపర్ హిట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మూడవ వారం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం పై ఆనంద్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

అనుపమ తరేజ పోస్ట్ చేసిన వీడియో కి రెస్పాన్స్ ఇస్తూ, అన్ బీటబుల్ కాంబో అయిన సూపర్ స్టార్ మహేష్ మరియు జావా మెరూన్ లను చూడకుండా ఎలా ఉండగలను, ప్రస్తుతం నేను న్యూ యార్క్ లో ఉన్నాను. న్యూ జెర్సీ కి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్షితమవుతుందో వెళ్లి చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :