“కల్కి” టీమ్ పై పొగడ్తల వర్షం కురిపించిన ఆనంద్ మహీంద్రా!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏ. డి (Kalki2898AD). ఈ చిత్రం ను జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా బుజ్జి X భైరవ గ్లింప్స్ వీడియో ను స్పెషల్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. బుజ్జి వెహికిల్ కి కీర్తి సురేష్ అందించిన వాయిస్ మరింత గా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది.

అయితే ఈ బుజ్జి వెహికిల్ కోసం ఆనంద్ మహీంద్రా అందించిన సహకారం పట్ల డైరెక్టర్ నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా కల్కి టీమ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. నాగ్ అశ్విన్ మరియు మేకర్స్ పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని అన్నారు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా బృందం పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్ మరియు పనితీరును అనుకరించడం ద్వారా ఫ్యూచరిస్టిక్ వెహికల్ కోసం కల్కి టీమ్ కి సహాయం చేసింది. వాస్తవానికి, వాహనం వెనుక గోళాకార చక్రానికి శక్తినిచ్చే రెండు మహీంద్రా ఇ -మోటార్ల పై నడుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఆనంద్ మహీంద్రా చేసిన వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ధన్యవాదాలు సార్. అసాధ్యమైన వాటిని కలలు కనడంలో మాకు సహాయం చేసినందుకు. మరియు మా బుజ్జికి రెక్కలు ఇచ్చినందుకు అని నాగ్ అశ్విన్ అన్నారు. అందుకు ఆనంద్ మహీంద్రా రెస్పాండ్ అవుతూ, కలలు కనడం ఎప్పుడూ ఆపకు అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version