అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తున్న ‘ఆనందో బ్రహ్మ’ !


తాప్సి ప్రధాన పాత్రలో ‘పాఠశాల’ ఫేమ్ మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. భయపడటం అనే భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలై ఊహించినదానికంటే మెరుగ్గానే వసూళ్ళను సాధిస్తోంది. మొదటి రోజు మార్నింగ్ షో తర్వాత బయటికొచ్చిన పాజిటివ్ టాక్ అన్ని ఏరియాల్లో సినిమా కలెక్షన్లు పుంజుకునే విధంగా సహాయపడింది.

ఇక కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ సాదరంగా ఆహ్వానించే ఓవర్సీస్ ప్రేక్షకులు అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రీమియర్లతో కలుపుకుని మొదటి మూడు రోజులకు ఈ సినిమా 2.9 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఊహించిన మొత్తానికంటే ఎక్కువే. ఈ విజయంతో సినిమాను హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.