“పుష్ప” నుంచి నెవర్ బిఫోర్ లుక్ లో అనసూయ.!

Published on Nov 10, 2021 10:33 am IST

మన టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అనసూయ భరద్వాజ్ అనే చెప్పాలి ఇది అందరికీ తెలుసు. అయితే స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై కూడా మంచి హార్డ్ హిట్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. కానీ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో తీసిన “రంగస్థలం” నుంచి చేసిన ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు సుకుమార్ తీస్తున్న మరో భారీ సినిమా “పుష్ప” లో కూడా అనసూయ కి దర్శకుడు కీలక పాత్ర ఇవ్వగా ఆ మధ్య అనసూయ దానిపై చాలా ఎగ్జైట్ అయ్యింది. దీనితో తన ఎగ్జైట్మెంట్ లో ఎలాంటి తప్పు లేదని ఇప్పుడు తన లుక్ పుష్ప నుంచి వచ్చినది చూస్తే అవుతుంది.

అసలు నెవర్ బిఫోర్ లుక్ లో అనసూయ ని దాక్ష్యాయని గా చిత్ర యూనిట్ పరిచయం చేశారు. తన లుక్ కానీ మేకోవర్ మొత్తం చాలా కొత్తగా కనిపిస్తుంది అంతే కాకుండా ఈ సినిమాలో తనది పక్కా నెగిటివ్ రోల్ లా ఉంటుందని కూడా అర్ధం అవుతుంది.

మొత్తానికి మాత్రం సుకుమార్ ప్లానింగ్ ఇంకో లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More