అనంత్ అంబానీ జస్ట్ ప్రీ వెడ్డింగ్ కే 2000 పైగా వెరైటీస్

అనంత్ అంబానీ జస్ట్ ప్రీ వెడ్డింగ్ కే 2000 పైగా వెరైటీస్

Published on Feb 27, 2024 4:03 PM IST


ప్రపంచ కుబేరులలో ముఖేష్ అంబానీ కోసం తెలియని వారు ఎవరు ఉండరు. సినిమా సంబంధిత అలాగే పారిశ్రామిక ఇతర రంగాల్లో రాణించిన తమ ఇంట ఓ శుభకార్యం అంటే దాని రీసౌండ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. మరి ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ప్రముఖ భరతనాట్యం ట్రైనర్ అలాగే ఎన్కోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా అయినటువంటి రాధికా మెర్చంట్ తో వివాహం ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే వీరి వివాహం జూలై లో ఉండగా ఈ మార్చ్ 1 నుంచి 3 తేదీల్లో ఘనంగా అంబానీ రెసిడెన్సీ లోనే గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ కి గాను అంబానీ ప్రిపేర్ చేయిస్తున్న వంటకాల వెరైటీస్ నెంబర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా వైరల్ గా మారింది. మరి ఈ మూడు రోజుల్లో ఏకంగా 2 వేల 500 వెరైటీస్ ని సిద్ధం చేస్తున్నారట.

దీనితో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనికే ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చే పెళ్ళికి ఏ రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మరి ముఖేష్ అంబానీ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ నుంచి రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ నటించిన “డంకి” వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు