నిన్న జగపతి బాబు.. నేడు అనంత శ్రీరామ్.. ‘పెద్ది’కి సాలిడ్ ఎలివేషన్స్..!

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించగా, చిత్ర యూనిట్ ఈ సినిమాపై, హీరో రామ్ చరణ్ పై చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల నటుడు జగపతి బాబు పెద్ది సినిమాపై కురిపించిన పొగడ్తల వర్షం మనం చూశాం. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ పెద్ది చిత్రం, రామ్ చరణ్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎక్కడా కనిపించడని, కేవలం ‘పెద్ది’ పాత్ర మాత్రమే కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

‘పెద్ది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. సినిమా చూస్తున్నంత సేపు ఆ అనుభూతి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఆ జ్ఞాపకాలు నాలుగైదు రోజుల పాటు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి’ అంటూ అనంత శ్రీరామ్ అనడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version