టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గతకొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, ఆమె పూర్తిస్థాయిలో తన పర్ఫార్మెన్స్‌ను చూపట్టలేదనే చెప్పాలి. అయితే, ఆమె తాజాగా నటిస్తున్న మూవీ ‘పొట్టేల్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాతో చిత్ర యూనిట్ ముచ్చటించారు. అయితే, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అనన్య చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ఇండస్ట్రీలో ఓ సినిమా సైన్ చేసే ముందుకు ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు కదా.. మీకెప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైందా..?’’ అని ఓ విలేకరి అనన్యను అడిగారు. దీనికి ‘‘అసలు ఓ సినిమా సైన్ చేసే ముందుకు కచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారని మీకెలా తెలుసు.. ఇదంతా కేవలం ఊహాగానమే.. అలాంటివి ఇండస్ట్రీలో కొన్నిచోట్ల మాత్రమే జరుగుతుంటాయి. నాకైతే ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఎదురవలేదు..’’ అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.
దీంతో అనన్య చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక పొట్టేల్ చిత్రాన్ని పూర్తి పీరియాడికల్ రా అండ్ రస్టిక్ చిత్రంగా మేకర్స్ తీర్చిదిద్దారు. ఈ సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.