“ఏవమ్ జగత్” రాధాస్ లవ్ సాంగ్ విడుదల చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ళ..!

Published on Sep 15, 2021 4:00 pm IST


కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో దినేష్ నర్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఏవం జగత్”. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్‌ని ‘వకీల్ సాబ్’ ఫేమ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ విడుదల చేశారు. అనంతరం ఆమె చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌కి శివ కుమార్ మ్యూజిక్ అందించగా, సందీప్ కూరపాటి మరియు సమీరా భరద్వాజ్ ఆలపించారు.

ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ వ్యవసాయం భవిష్యత్తు ఏంటి? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా? అనే అంశాలను ప్రధానంగా ‘ఏవం జగత్’ మూవీలో చూపిస్తున్నామని, వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే ‘ఏవం జగత్’ అని అన్నారు. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయని, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :