డ్రగ్స్ కేసులో ఆ హీరోయినే మెయిన్ ?

Published on Oct 24, 2021 11:30 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్య‌న్ ఖాన్‌’ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే చాలామందిని ఎన్‌.సీ.బీ అధికారులు విచారించారు. అయితే, అసలు ఆర్యన్ ఖాన్ కి డ్రగ్స్ ను పరిచయం చేసింది ఎవరు ? అన్న దగ్గర నుంచి విచారణ మొదలయ్యింది. ఆ విచారణలో ప్రముఖంగా వినిపించిన పేరు హీరోయిన్ అనన్య పాండే. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అనన్య పాండే వివరణ ఇచ్చినా అది నమ్మశక్యంగా లేదు. దాంతో ఆమె పై మరింతగా నిఘా పెట్టారు అధికారులు.

పైగా అనన్య పాండేను పిలిపించి ఎన్‌సీబీ అధికారులు చాలా లోతుగా విచారించారు. ఎంతగా అడిగినా అనన్య మాత్రం ఒకే రకం సమాధానాలు చెప్పిందట. ఇక తన జీవితంలో ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకొచ్చిన అనన్య.. మరి డ్రగ్ డీలర్స్ తో ఎందుకు చాట్ చేసింది ? అలాగే షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ కు డ్రగ్స్ డీలర్స్ నెంబర్లు ఎలా ఇచ్చింది ? లాంటి విషయాల పై ఆమె మౌనవ్రతం పాటించిందట. మొత్తానికి ఈ డ్రగ్స్ కేసులో తెలిసి తెలియకుండా అనన్య ముఖ్య పాత్ర పోషించింది.

సంబంధిత సమాచారం :