అనసూయ మళయాల మూవీ లుక్ అదిరిందిగా..!

Published on Dec 29, 2021 2:34 am IST

యాంకర్ అనసూయ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా ఆఫర్లను పట్టేస్తుంది. ఇటీవల వచ్చిన “పుష్ప” సినిమాలో “దాక్షాయని” పాత్రలో నటించి మెప్పించింది. అయితే తమిళ, మళయాల, హిందీ భాషల్లో సినిమాలు చేసేందుకు కూడా అనసూయ మొగ్గు చూపుతోందన్న సంగతి తెలిసిందే. గతంలో మమ్ముట్టి సినిమా ద్వారా కేరళ ప్రేక్షకులను పలకరించబోతున్నట్టు చెప్పిన అనసూయ తన పాత్రకి సంబంధించిన విశేషాలను మాత్రం బయటపెట్టలేదు.

అయితే తాజాగా అనసూయ తన పాత్ర పేరు, కారెక్టర్ లుక్‌కు సంబంధించిన అప్డేట్‌ని ఇచ్చింది. అలీస్‌ను కలవండి.. అమల్ నీద్ సర్, మమ్ముట్టి సర్‌లకు థ్యాంక్స్. మళయాలంలో ఇలా పరిచయం అవుతానని ఎప్పుడూ కలగనలేదు.. ఇంత కంటే మంచి అవకాశం దొరికిందని అనసూయ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :