“పుష్ప”లో తన రోల్, సుకుమార్ పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 18, 2021 2:36 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ ల కాంబోలో వస్తున్న తాజా చిత్రం “పుష్ప”. అలాగే వీరి నుంచి కూడా మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా కూడా ఇదే. మరి అంతటి స్ట్రాంగ్ సబ్జెక్టు తోనే వస్తున్న ఈ చిత్రంలో పలువురు కీలక నటులు కూడా నటిస్తున్నారు.

మరి వారిలో స్మాల్స్ గ్లామరస్ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. అయితే ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరి అది ఖచ్చితంగా తన లైఫ్ లోనే మరో మెమొరబుల్ రోల్ గా ఉంటుంది అని మళ్ళీ చెప్పింది. అలాగే సుకుమార్ అయితే ఆర్టిస్టులను ఒక లెక్కలో చెక్కుతారని..

ఇంకా తాను దాదాపు ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వరని విన్నాను కానీ తనకి ఇవ్వడం అదృష్టంగా భావిస్తానని అనసూయ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :