“ఖిలాడీ”కి అత్తగా అనసూయ.. సినిమాకే హైలైట్ కానుందా..!

Published on Feb 3, 2022 3:00 am IST

యాంకర్ అనసూయ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమా ఆఫర్లు దక్కడంతో బిజీగా బిజీగా మారిపోయింది. అయితే సాధ్యమైనంత వరకూ అనసూయ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించేందుకే ఎక్కువగా ఆసక్తిని చూపుతోందని, దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఆ విధంగా చూపించడానికే ప్రాధాన్యతనిస్తున్నారని తెలుస్తుంది.

ఇటీవల వచ్చిన “పుష్ప” సినిమాలో గ్లామరస్‌గా కాకుండా “దాక్షాయని” అనే మాస్ పాత్రలో చేసి మెప్పించింది. అయితే ఈ సారి అనసూయ పవర్‌ఫుల్ పాత్రతో పాటు కాస్త గ్లామరస్‌గా కనిపించబోతుందని అంటున్నారు. మాస్ మహరాజ్ రవితేజ “ఖిలాడీ” చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరికి తల్లిగా, రవితేజకి అత్తగా అనసూయ పాత్ర ఉంటుందని, ఆమె పొషించిన “చంద్రకళ” పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరీ అత్త పాత్రలో అనసూయ ఎలా మెప్పిస్తుందనేది. ఇకపోతే ఖిలాడీ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :