ఆ షోలో తమన్నా ప్లేస్‌లో అనసూయ రాబోతుందా?

Published on Oct 7, 2021 2:46 am IST


హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్‏ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‏కు హీరో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్‏గా వ్యవహరిస్తుండగా, తెలుగుకు తమన్నా హోస్ట్‏గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం తెలుగులో మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు.

దీంతో ఈ షోలో చిన్న మార్పు తీసుకురావాలని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారట. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమన్నా స్థానంలో యాంకర్ అనసూయను తీసుకోబోతున్నారట. అయితే షో రేటింగ్ డల్‌గా ఉన్న కారణంగానే ఈ మార్పు చేస్తున్నారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :