మెగాస్టార్ మరో మూవీలో అనసూయ?

Published on Feb 16, 2022 3:00 am IST

బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా యాంకర్ అనసూయ దూసుకుపోతుంది. టాలీవుడ్ సినిమాలలో ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది అనసూయ. రామ్‌ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” చిత్రంలో రంగమ్మత్తగా నటించి మెప్పించగా, ఇటీవల పుష్పలో “దాక్షాయణి” అనే మాస్ పాత్రలో, రవితేజ “ఖిలాడీ”లో చంద్రకళ అనే పాత్రలో నటించి అదరగొట్టింది.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న “ఆచార్య” సినిమాలో కూడా అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే మెగాస్టార్ మరో మూవీలో నటించే ఛాన్స్ అనసూయ కొట్టేసిందని సమాచారం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో అనసూయ ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే అనసూయ ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతుందట.

సంబంధిత సమాచారం :