షాకింగ్..అనసూయ ఓటమితో సరికొత్త అనుమానాలు..ఏం జరుగుతుందో?

Published on Oct 12, 2021 8:05 am IST


మన టాలీవుడ్ ఆల్ టైం గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒక్క స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా ఒక నటిగా కూడా తానేంటో ప్రూవ్ చేసుకొని ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అట్టహాసంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి “మా”(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేశారు.

అయితే మొన్న ఆదివారం ఫలితాల రోజు అనసూయ భారీ మెజార్టీతో విజయం సాధించేసింది అని కన్ఫర్మ్ కూడా చేసేసారు. కానీ మళ్ళీ ఒక్క రోజు గడిచేసరికి ఆమె మళ్ళీ ఓటమి పాలయ్యింది అని ప్రకటన రావడంతో దానిపై అనసూయ సర్కాస్టిక్ పోస్ట్ తో అదరగొట్టేసింది.

“క్షమించాలి..ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దే.. నిన్నేమో భారీ మెజార్టీ, అత్యధిక మెజార్టీ అని చెప్పి ఈరోజు ఏమో ఓటమి అంటున్నారు. రాత్రికి రాత్రే ఏం జరిగిందబ్బా అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అసలు సుమారు 900 ఓట్లు ఉంటే 600 చిల్లర ఓటర్లు లెక్కింపు రెండో రోజుకి వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి? ఆహా అర్ధం కాక అడుగుతున్నానని” అనసూయ తన ఓటమితో ఒక రకమైన స్పందనని తెలియజేసారు. దీనితో ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓటమిపై మంచు విష్ణు గెలుపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :