అందర్నీ సర్‌ ప్రైజ్‌ చేయాలని కంకణం కట్టుకున్నా – అనసూయ

Published on Dec 13, 2021 7:08 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ.. ‘‘ఒకరోజు అల్లు అర్జున్‌ తో చేయాలని స్టేజ్‌ పై అడిగా. అలా అడిగిన వారం రోజుల్లోనే ఫోన్‌ చేసి ఈ పాత్ర నాకు ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో నేను చేసిన రంగమ్మత్త పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను.

ఈ సినిమాలో దాక్షాయణి గా కనిపిస్తా. సినిమాటోగ్రాఫర్‌ నన్ను బాగా చూపించారు. రాబోయే రోజుల్లో సునీల్‌ను‌, నన్ను బాగా చూస్తారు. సినిమాలకు వచ్చేసరికి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేయాలని కంకణం కట్టుకున్నా. టెలివిజన్‌పై గ్లామర్‌గా చూస్తున్నారు కాబట్టి, ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది ‘పుష్ప ది రైజ్‌’ మాత్రమే. ఆ తర్వాత వచ్చేది చూస్తే ‘తగ్గేదే లే’ అని మీరే అంటారు’’ అని అనసూయ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :