మహేష్ -సుకుమార్ సినిమాలో ప్రముఖ యాంకర్ !

Anasuya Bharadwaj

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్నారు. ఈచిత్రం ఇటీవలే లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. ప్రస్తుతం సుక్కు ఈ చిత్రానికి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రకు ప్రముఖ యాంకర్ అనసూయను తీసుకోవాలనుకుంటాడట.

‘రంగస్థలం’ లో అత్త పాత్రలో నటించి మెప్పించింది అనసూయ ఈచిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సుకుమార్, మహేష్ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని అనుకుంటున్నాడట. జూన్ లో ఈ చిత్రంసెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version