టీవీ షోతో మళ్ళీ పాపులర్ అయిన అనసూయ!
Published on Aug 15, 2016 4:30 pm IST

anasuya
టీవీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా అదే స్థాయిలో మెప్పించిన విషయం తెలిసిందే. అయితే వరుసగా సినిమా అవకాశాలు వస్తూన్నా, అనసూయ, వాటితో పాటు తనకు క్రేజ్ తెచ్చిన టీవీ షోస్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేస్తోన్న ‘ఏ డేట్ విత్ అనసూయ’ అన్న షో కొద్దిరోజులుగా బాగా పాపులర్ అయింది. ప్రముఖ టీవీ చానల్ టీవీ 9లో ప్రసారమవుతోన్న ఈ షోలో స్టార్స్ చెప్పే కబుర్లు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే అఖిల్, నాని లాంటి స్టార్స్ ఈ షోలో పాల్గొని తమ ఇష్టాలను పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ షోకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ ఉంది. మున్ముందు ఈ షోలో మరింత మంది స్టార్స్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇటు సినిమాలు చేస్తూనే, షోస్‌తో కూడా సినీ పరిశ్రమతోనే టచ్‌లో ఉంటూ అనసూయ చేసిన ప్లాన్ ఆమె కెరీర్‌కు బాగానే ఉపయోగపడుతోందని చెప్పుకోవాలి.

 
Like us on Facebook