ఇంతకన్నా ముఖ్యమైన వార్తలు లేవా ? – ఝాన్సీ

Published on Oct 11, 2021 3:26 pm IST

సీనియర్ యాంక‌ర్ మరియు న‌టి ఝాన్సీ మీడియా పై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను షేర్ చేశారు. ‘అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా?

సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి” అంటూ ఝాన్సీ పోస్ట్ చేశారు. ఝాన్సీ అంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ మహిళ. అందుకే ఎప్పటికపుడు సోష‌ల్ మీడియాలో తనదైన శైలిలో ప‌లు అంశాల‌పై స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.

సంబంధిత సమాచారం :