భోళా శంకర్ లో స్పెషల్ సాంగ్ కోసం వినిపిస్తున్న ఈ యాంకర్ పేరు?

Published on Nov 25, 2021 3:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో ఇప్పటికే భారీ నటీనటులు చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఒక స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ యాంకర్, నటి రష్మీ ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా వేదిక గా వార్తలు వస్తున్నాయి.

రష్మీ ఇప్పటి వరకూ కూడా అలా ఇతర చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినట్లు లేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన ఇంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది అనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తప్ప మేకర్స్ ఎవరూ కూడా రష్మీ ను తీసుకోమని చెప్పలేదు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :