బిగ్ బాస్ 5: ఈ కంటిస్టెంట్ విన్ కావాలని కోరుకుంటున్న యాంకర్ రవి!

Published on Dec 15, 2021 3:30 pm IST

బుల్లితెర పై వస్తున్న కార్యక్రమాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పాలి. ఈ షో మిగతా వాటిలా కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఐదవ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే యాంకర్ రవి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

యాంకర్ రవి ఈ ఏడాది బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి, ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మేకర్స్ షో లో ఏం జరిగిందో చూపించడం లేదు అని, మసాలా మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు అని అన్నారు. అంతేకాక హౌజ్ లో ఉన్న శ్రీరామ్ లాంటి బలమైన ఆటగాడు హైలైట్ కావడం లేదు అని అన్నారు. అతను చేసిన త్యాగాలను మేకర్స్ చూపించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం షో లో శ్రీరామ్ ఫైనల్ గెలిచే అవకాశం ఉంది. అతనికి టఫ్ కాంపిటీషన్ గా పాపులారిటీ లో అతని స్థానం లో సన్ని ఉన్నాడు. మరి ఈ షో లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తి గా మారింది.

సంబంధిత సమాచారం :