“బిగ్ బాస్ 5”..అతడి విషయంలో లైవ్ లో రవి హాట్ కామెంట్స్.!

Published on Dec 1, 2021 9:04 am IST


అసలు ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి మొన్న జరిగినటువంటి బిగ్ బాస్ 5 ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసాడు. డెఫినెట్ గా ఓ ఫైనల్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేషన్ విషయంలో తన ఫ్యాన్స్ కూడా ఒకింత బాధ పడ్డారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు రవి మొదట సారిగా తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చాడు.

అయితే ఇందులో ఓ కంటెస్టెంట్ విషయంలో బిగ్ బాస్ షో వారు చూపిస్తున్న దానిపై ఇంట్రెస్టింగ్ హాట్ కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది. కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర విషయంలో బిగ్ బాస్ షో వాళ్ళు సరైన స్పేస్ లో చూపించడం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.

తాను బయటకొచ్చి చూసిన ఎపిసోడ్స్ లో గమనించింది ఇది అని, హౌస్ లో మొదటి రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా తనకి ఇచ్చిన పని తప్పకుండా చేసే మొదటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది చందూ. అలాంటిది అతనికి స్పేస్ ఇవ్వకుండా చూపిస్తున్నట్టు నాకు అనిపించింది అని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :