బిగ్‌బాస్ 5: యాంకర్ రవి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా?

Published on Dec 4, 2021 3:00 am IST


బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ పదమూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జశ్వంత్, పదకొండో వారం యానీ మాస్టర్, మొన్న వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు.

అయితే టాప్‌-5లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న రవి గత వారం అనూహ్యంగా ఎలిమినేట్‌ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రవిది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని, కావాలనే రవిని హౌస్ నుంచి బయటకు పంపించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నిర్వాహకులు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో రీ ఎంట్రీ, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అనేవి జరగలేదు. దీంతో రవిని రీఎంట్రీగా పంపించాలని షో నిర్వాహకులు ప్లాన్‌ చేశారట. మరీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :