“జయమ్మ పంచాయతీ”కి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న యాంకర్ సుమ..!

Published on Mar 6, 2022 3:00 am IST


బుల్లితెరపై నంబర్‌వన్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సుమ కెరిర్ మొదట్లో పలు చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత పలు కారణాల వలన సినిమాల్లో నటించలేదు. కేవలం టెలివిజన్‌కు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత సుమ‌ మళ్ళీ వెండి తెరవైపు ఎంట్రీ ఇచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్న “జయమ్మ పంచాయితీ”లో సుమ టైటిల్ రోల్ పోశిస్తుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం కోసం సుమ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఒక్కో ఈవెంట్‌కి 3 నుంచి 5 లక్షల వరకు, అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్న సుమ ఈ చిత్రం కోసం దాదాపు 50 లక్షల వరకు ఛార్జ్ చేసిందట. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా ఇంత మొత్తంలో ఇచ్చారని థియేటర్స్‌లో కాకపోయినా.. టీవీలో అయినా వర్కవుట్ అవుతుందని వారు అనుకున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :