కవల పిల్లలకు జన్మనివ్వనున్న స్టార్ యాంకర్!

28th, August 2016 - 10:47:02 AM

uday-bhanu
టీవీ స్టార్ ఉదయ భాను గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే టీవీ, సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత వరుసగా టీవీ షోస్ చేస్తూ యాంకర్‌గా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక కొద్దికాలంగా కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె, గర్భవతిగా ఉండడం వల్లే ఇలా కెరీర్‌కు దూరంగా ఉన్నారని తెలిసింది. మరో వారం రోజుల్లో ఉదయ భాను తల్లి కాబోతున్నారు. ఇక ఒకేసారి ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనివ్వనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.

తన గర్భంలో ప్రస్తుతం కవల పిల్లలు ఉన్నారని, వారం రోజుల్లో తమ ఇంట పిల్లల సందడి మొదలవ్వడం తల్చుకుంటేనే ఎంతో సంతోషంగా ఉందని ఉదయభాను ఈ సందర్భంగా తెలిపారు. బిజినెస్ మేన్ విజయ్‌తో పదేళ్ళ క్రితమే ఉదయభాను వివాహం జరగ్గా, ఆర్థికంగా అంతా సెట్ అయ్యాకే, ఈ దంపతులు పిల్లలను కనాలని అనుకున్నారట. ఇక ఇప్పుడు తమ కుటుంబంలోకి ఇద్దరు కొత్త వ్యక్తులు రానుండడంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పుకోవాలి.