మరోసారి అలరించనున్న అందాలరాక్షసి జంట
Published on Jul 28, 2015 1:36 am IST

lavanyaa
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటిలు ‘అందాల రాక్షసి’ సినిమాలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసినదే. తొలివిజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఎవరి కెరీర్ లో వాళ్ళు మునిగిపోయారు. ప్రస్తుతం మరో సినిమాలో ఈ జంట కలిసి నటిస్తుంది. ‘లచ్చిమి దేవికి ఒక లేక్కుంది(LOL)’ అనే టైటిల్ తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వీరి కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కావడం విశేషం.

రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జగదీష్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో లావణ్య కొత్త అవతారంలో అందరినీ ఆకట్టుకుంది. మయుఖా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook