
విశ్వశ్రీ ఆర్ట్స్ పతాకంపై నాగరాజు కొట్టే నిర్మించిన సినిమా ‘అందమైన మాయ’. మణీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ‘మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌లు ఈ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అందమైన మాయ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు కాంక్షించారు.
ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని చిత్ర దర్శకుడు మణింద్రన్ తెలిపారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని సినిమా యూనిట్ పేర్కొంది. కార్తీక్, భవ్యశ్రీలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సత్య సోమేష్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ జై సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.