‘పక్కా కమర్షియల్’ నుండి అందాలరాశి వీడియో సాంగ్ అవుట్ … !!

Published on Jun 28, 2022 4:41 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా ల కలయికలో యువ దర్శకుడు మారుతీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థలు గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్ లాయర్ గా నటిస్తుండగా సత్యరాజ్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిందని యూనిట్ చెపుతోంది.

జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి కర్మ్ చావ్లా ఫోటోగ్రఫి అందించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకుని మూవీపై బాగా అంచనాలు ఏర్పరిచాయి. జులై 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నుండి అందాలరాశి అనే పల్లవితో సాగే వీడియో సాంగ్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. సాయి చరణ్, రమ్య బెహరా ఎంతో అద్భుతంగా ఆలపించిన ఈ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మరి తొలిసారిగా మారుతి, గోపీచంద్ కలిసి చేస్తున్న ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ కొడుతుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :