ప్రీ రిలీజ్ ఈవెంటుకు సిద్దమవుతున్న ‘అంధగాడు’ !


యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంధగాడు’. ఇందులో రాజ్ తరుణ్ చూపులేని వ్యక్తిగా నటించడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై మంచి పాజిటివ్ క్రేజ్ నెలకొంది. చిత్ర యూనిట్ కూడా ఈ క్రేజ్ ను మరింతగా పెంచేందుకు ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో భాగంగానే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు.

సాయంత్రం 7 గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది. చిత్ర ప్రముఖ తారాగణం రాజ్ తరుణ, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజా రవీందర్ వంటి వారంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ మొదటిసారి దర్శకత్వం వహిస్తూ చేసిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించగా చిత్రాన్ని జూన్ 2న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.