సక్సెస్ టూర్ మొదలుపెట్టనున్న ‘అంధగాడు’ టీమ్ !
Published on Jun 5, 2017 10:07 am IST


రాజ్ తరుణ నటించిన తాజా చిత్రం ‘అంధగాడు’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ తో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదల రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రంతో రాజ్ తరుణ్ వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్లైంది. అంతేగాక నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది.

ఇలా ఆరంభంలోనే పాజిటివ్ క్రేజ్ సొంతం చేసుకున్న సినిమాను ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర టీమ్ సక్సెస్ టూర్ ను మొదలుపెట్టనుంది. ఏపి, తెలంగాణాల్లోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఈ టూర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన లక్కీ హీరోయిన్ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు.

 
Like us on Facebook