‘బిగ్ బాస్’ను హైకోర్టు బ్యాన్ చేయాలట !

Published on May 1, 2022 10:00 pm IST

‘బిగ్ బాస్’ రియాలిటీ షో పై చాలా వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా సంప్రదాయవాదులకు ఈ షో అస్సలు నచ్చదు. చాలా కాలంగా వాళ్ళు ఈ షోని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకే ఇంటిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండటం అనేది మన సంస్కృతికి వ్యతిరేకం అని వాళ్ళ అభిప్రాయం. ఐతే, తాజాగా బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

బిగ్‌ బాస్‌ కార్యక్రమం పై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్‌ బాస్‌ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో తాను హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ గేమ్స్, ఎమోషన్స్, అలాగే వారి మధ్య జరిగే గొడవలు, ఆ గొడవల కారణంగా వచ్చే కన్నీళ్లు కూడా అంతా ప్లాన్ ప్రకారం జరుగుతాయట.

సంబంధిత సమాచారం :