ఇంటర్వ్యూ : ఆండ్రియా – ‘డిటెక్టివ్’ కోసం కష్టపడి హార్లే డేవిడ్ సన్ బైక్ కూడా నేర్చుకున్నాను !
Published on Nov 5, 2017 1:33 pm IST

విశాల్ నటించిన తాజా చిత్రం ‘తుప్పరివాలన్’ తమిళంలో మంచి విజయాన్ని అందుకుని తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్రంలో నటించిన ఆండ్రియా మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం…

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇదొక డిటెక్టివ్ స్టోరీ. చాలా థ్రిల్లింగా ఉంటుంది. డైరెక్టర్ మిస్కిన్ చాలా కొత్తగా తీశారు. తమిళంలో మంచి హిట్టైంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాలని అనుకుంటున్నాను.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నేను ఒక హంతకిగా నటించాను. పెద్దగా మాట్లాడను. పాత్రలోని అన్ని వేరియేషన్స్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కోసం హార్లే డేవిడ్ సన్ బైక్ నడపడం కూడా నేర్చుకున్నాను.

ప్ర) విశాల్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ఈ చిత్ర నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చేశారు. ప్రత్యేకమైన ఆసక్తి పెట్టి నటించారు.

ప్ర) ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఎలా అనుకుంటున్నారు ?
జ) తమిళ్, తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. పెద్ద విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కూడా పాటలు ఉండవు. అంతా స్టోరీనే. ఇందులో కూడా అంతే ప్రత్యేకంగా పాటలేవీ ఉండవు. ఇదొక డిఫరెంట్ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

ప్ర) మీ ‘అవల్’ సినిమా తమిళంలో బాగా ఆడుతున్నట్టుంది ?
జ) అవును… అదొక కంప్లీట్ హర్రర్ ఎంటర్టైనర్. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను.

ప్ర) ఆ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) అందులో ఎలాంటి పాటలు, డ్రామా ఉండదు. అంతా హర్రర్ కంటెంటే. ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ సినిమా చూడటం ఒక మంచి అనుభవంలా ఉంటుంది.

ప్ర) ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
జ) నాకు నచ్చిన సినిమాలే చేయాలని అనుకుంటున్నాను. ఒక నటిగా నా ఎదుగుదలకు ఉపయోగపడే కథలు, పాత్రలు ఎంచుకుంటాను. ఈ సంవత్సరం నేను చేసిన మూడు సినిమాలు మూడు రకాలుగా ఉంటాయి.

ప్ర) ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేదు ?
జ) ఎందుకు చేయలేదు అంటే సరైన ఆఫర్ రాలేదు కాబట్టి. అన్ని విధాలా తగిన అఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. పైగా నా అన్ని తమిళ సినిమాలు తెలుగులో రిలీజవుతున్నాయి కూడ.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook