
‘విశ్వరూపం’, ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ ఆండ్రియా జేరేమియా. హీరోయిన్ మాత్రమె కాదు ఆండ్రియా మంచి సింగర్ కూడా. ‘ది సోల్ అఫ్ తారామణి’ అనే పాటకు స్వయంగా లిరిక్స్ రాయడంతో మ్యూజిక్ కంపోజ్ చేసి పాడింది. ఈ పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారనుంది అని చెన్నై మీడియా టాక్. ఓ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సైన్ చేసిందట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఎన్టీఆర్ ‘రాఖి’ సినిమాలో జర జర.. నాగ చైతన్య ‘దడ’ సినిమాలో దివాలి దీపాన్ని… పాటలు తెలుగులో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ఆండ్రియా ఎక్కువ పాటలు పాడింది.