అర్జున్ రెడ్డి డైరెక్టర్ పై బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 25, 2022 2:34 pm IST

అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత బాలీవుడ్ లో అదే చిత్రాన్ని షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అంటూ తీసి బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ అనిల్ కపూర్ లతో యానిమల్‌ అనే చిత్రం తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి, దర్శకుడు సందీప్ గురించి అనిల్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

ఈ చిత్రం కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ ప్రాజెక్ట్‌లో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ఒక సాలిడ్ సబ్జెక్ట్ రెడీ చేశారు అని అన్నారు. అంతేకాక బాలీవుడ్ లో మంచి ప్లేస్ కి వెళ్తాడు అంటూ చెప్పుకొచ్చారు. యానిమల్ చిత్రం అనేది గ్యాంగ్‌స్టర్ల నేపథ్యంలో కుటుంబ రాజకీయాల గురించి. బాబీ డియోల్, రష్మిక కూడా ఈ చిత్రం లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :