రామ్ – బోయపాటి సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Nov 28, 2022 12:01 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అట. అందుకే.. మరో సీనియర్ హీరోని ఈ పాత్ర కోసం తీసుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ మాజీ హీరో అనిల్ కపూర్ ని ఈ పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఐతే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. ఇక ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు. కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :