బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాపై ట్రిపుల్ అప్డేట్..!

Published on May 24, 2022 1:44 am IST


నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబొలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తున్న అనిల్ రావిపూడి తాజాగా ఈ సినిమాకి సంబంధించి మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చాడు. ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుందని, బాలయ్య 45 ఏళ్ల తండ్రి పాత్రలో నటిస్తున్నారని, సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఇందులో ఫ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయని చెప్పుకొచ్చాడు. కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అన్నాడు. ఇక బాలయ్య కూతురిగా “పెళ్లిసందడి” ఫేం శ్రీలీలా నటిస్తుందని అనిల్ రావిపూడి తెలిపాడు.

సంబంధిత సమాచారం :