బాలయ్య సినిమాపై ఆ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on May 9, 2021 1:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం అనంతరం మరో రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ కూడా బాలయ్య లైన్ లో పెట్టేసారు. మరి అలా సెట్టయిన చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన చిత్రం కూడా ఒకటి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై గత కొన్ని రోజుల నుంచి ఓ ఆసక్తికర టాక్ ఉంది.

మరి దానిపైనే అనీల్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇది ఎలాంటి మల్టీ స్టారర్ చిత్రం కాదని ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా పూర్తయ్యిపోయిందని అంతే కాకుండా అది పూర్తిగా డిఫరెంట్ జానర్ అని అనీల్ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఎప్పటి నుంచో మల్టీ స్టారర్ అన్న రూమర్ కు దర్శకుడు చెక్ పెట్టేసినట్టే అని చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :