మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొంటున్నట్టుగా డేట్ ని ఇచ్చి కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి తన రోల్ పై ఓ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. వెంకీ మామ రోల్ నిడివి ఎంతసేపు ఉంటుంది అనేది దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాలో వెంకీ మామ 20 నిమిషాల పాటుగా తాను ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో వెంకీ మామ ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్ అని చెప్పాలి. అలాగే ఇద్దరు నడుమ సాలిడ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని తాను తెలిపారు. అంతే కాకుండా ఇద్దరి నడుమ ప్లాన్ చేసిన సాంగ్ కూడా అదిరింది అని వారి హుక్ స్టెప్ కూడా షేక్ చేస్తుందని రివీల్ చేశారు.
అంతే కాకుండా సినిమాలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది అని తన గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం తరహాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకా దానికి మించిన బలమైన కథ ఇందులో ఉన్నాయని తాను తెలిపారు. సో మొత్తానికి మాత్రం థియేటర్స్ లో మంచి ట్రీట్ ఖాయమని చెప్పవచ్చు.
