తమన్నాతో గొడవపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

Published on Jun 7, 2022 1:39 am IST

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. మే 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్‌కు, హీరోయిన్‌ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ, అందుకే తమన్నా ఎఫ్‌ 3 ప్రమోషన్స్‌కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా అనిల్ రావిపూడి బిజీగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నాతో జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఒకరోజు రాత్రి షూటింగ్‌ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికి తమన్నా పొద్దున్నే జిమ్‌ చేసుకోవాలని, టైం లేదని చెప్పి వెళ్లిందని, అలా రెండురోజులు మా మధ్య కొంత గ్యాప్ నడిచిందని అన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నామని, వేరే సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వలనే తమన్నా ప్రమోషన్స్‌కు రాలేకపోయిందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :