మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందా ?

Published on Sep 14, 2021 2:12 am IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అందుకే అనిల్ రావిపూడి తరువాత సినిమాల పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా హీరో రామ్ – అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రానుందని.. ఇప్పటికే వీరిద్దరూ కథ విషయమై సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. అనిల్ తో సినిమా చేయడానికి రామ్ బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడట.

మొత్తానికి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసి హిట్ కొట్టాడు. అలాగే ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :