‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా కథ ఇదేనా ?

‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా కథ ఇదేనా ?

Published on Nov 28, 2022 6:30 PM IST

నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, బాలయ్య కోసం తాను ఓ భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ ను రాసినట్లు అనిల్ రావిపూడి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ముప్పై ఐదేళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి ఏభై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట.

బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. అలాగే సినిమాలో ఫాదర్ – కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొత్తానికి అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు