బాలయ్య సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Feb 28, 2023 9:02 am IST

నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ మూవీగా రాబోతుంది. పైగా ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెప్పబోతున్నారు. అలాగే బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే.. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి అరవై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట. బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. మొత్తానికి అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి

సంబంధిత సమాచారం :