‘యానిమల్’ : అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Published on Sep 21, 2023 10:02 pm IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందున్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ యానిమల్. భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. అమిత్ రాయ్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి మన్నన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక నేడు ఈ మూవీలో అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. యానిమల్ కా బాప్ బల్బీర్ సింగ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన అనిల్ కపూర్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఆయన తగిలిన గాయాలకు చికిత్స తీసుకుని కమిలిపోయిన ఫేస్ తో కనిపిస్తున్నారు. మొత్తంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో ఈ మూవీలోని ప్రతి ఒక్క పాత్ర ఉంటుందని అంటున్నారు మేకర్స్. కాగా యానిమల్ టీజర్ ని సెప్టెంబర్ 28న ఉదయం 10 గం. లకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :